Agreement between MEA and BMVSS for 'India for Humanity' project extended
Agreement between MEA and BMVSS for 'India for Humanity' project extended
August 05, 2020
'ఇండియా ఫర్ హ్యుమానిటీ' ప్రాజెక్ట్ కొరకు MEA మరియు BMVSS మధ్య ఉన్న ఒప్పందం పొడిగించబడింది
ఆగస్టు 05, 2020
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) 2018 అక్టోబర్ 9 న 'ఇండియా ఫర్ హ్యుమానిటీ' చొరవను xxxxxxx xxxxx యొక్క కరుణ, సంరక్షణ మరియు మానవాళి సేవ యొక్క తత్వంపై దృష్టిపెడుతూ అయన 150 వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రారంభించింది. ఈ చొరవతో 12 దేశాలలో 13 కృత్రిమ అవయవ అమరిక శిబిరాలు నిర్వహించబడ్డాయి మరియు 6500 కి పైగా కృత్రిమ అవయవాలు అమర్చబడ్డాయి. ఈ శిబిరాలు పూర్తిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేత స్పాన్సర్ చేయబడి, ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ "భగవాన్ మహావీర్ విక్లాంగ్ సహయాతా సమితి" (BMVSS) చేత నిర్వహించబడింది.
2. మాలావి, ఇరాక్, నేపాల్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇథియోపియా, సిరియా తదితర దేశాలలో నిర్వహించబడిన ఈ శిబిరాలు భారతదేశానికి చాలా మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఈ శిబిరాలు అంగహీనులకు శారీరక, ఆర్థిక మరియు సామాజిక పునరావాసం కల్పించడం ద్వారా వారు మళ్ళీ వారి సామర్ధ్యం మరియు గౌరవాన్ని తిరిగి పొందడంతో సమాజంలో స్వాభిమాన మరియు ఉత్పాదక సభ్యులుగా మారడానికి సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశం వాసుధైవ్ కుతుంబ్కం నుండి తీసుకోబడి తన ప్రధాన విలువ క్రింద తన అభివృద్ధి భాగస్వామ్యంలో మానవతా సహాయం అందిస్తోంది.
3. ఈ నేపథ్యంలో, 2020 ఆగస్టు 5 న, MEA మరియు BMVSS మధ్య ఒప్పందం మరొక 3 సంవత్సరాలు పొడిగించబడింది అనగా, మార్చి 2023 వరకు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తరపున కార్యదర్శి (ER) శ్రీ రాహుల్ ఛబ్రా ఈ ఒప్పందంపై సంతకం చేయగా, BMVSS తరపున శ్రీ xxxxx xxxxx సంతకం చేశారు.
క్రొత్త ఢిల్లీ
ఆగస్టు 05, 2020
DISCLAIMER : This is an approximate translation. The original is available in English on MEA’s website and may be referred to as the official press release.